రామగుండం: మద్యం మత్తులో రోకలితో దాడి.. యువకుడు మృతి ... Darsi Live News

రామగుండం: మద్యం మత్తులో  రోకలితో దాడి.. యువకుడు మృతి ... Darsi Live News

రామగుండం: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు ఘర్షణ పడి క్షణికావేశంతో స్నేహితుడిని మరో స్నేహితుడు రోకలితో కొట్టిన ఘటనలో ఓ యవకుడు మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... అంతర్గాం మండలం గోయల్‌వాడలో మామిడాల అనిల్ మద్యం మత్తులో తన స్నేహితుడు నేరేళ్ల చందు(27) ను రోకలితో తలపై కొట్టడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనిల్ ఇంట్లో చందు, అనిల్ తండ్రి శంకరయ్య ముగ్గురు కలిసి మద్యం సేవిస్తూ విందు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనిల్, చందుల మధ్య గొడవ జరిగింది. వారిని ఆపడానికి ప్రయత్నించిన శంకరయ్యను ఇంటి నుంచి బయటకు పంపారు. కొద్ది సేపటికి శంకరయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా.. రక్తం మడుగులో చందు మృతి చెంది ఉన్నాడు. మంచం పక్కనే రోకలి ఉంది. వారిద్దరి మధ్య ఏ విషయమై గొడవ జరిగిందనేది తెలియాల్సి ఉంది. రామగుండం సీఐ టి.కరుణాకర్ రావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. చందు, అనిల్ అవివాహితులు, కులవృత్తి చేసుకుంటూ గ్రామంలో జీవిస్తున్నారు. అనిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చందు తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టున్నట్లు ఎఎస్సై టి.పురుషోత్తం రెడ్డి తెలిపారు.