రూ.80కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ధర.. Darsi Live News

రూ.80కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ధర.. Darsi Live News

15రోజులు వరుసగా పెరగడం ఇదే ప్రథమం

న్యూఢిల్లీ : దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర 80కి చేరువైంది. 15 రోజుల నుండి వరుసగా పెట్రోల్‌ ధరలు పెరగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఆదివారం పెట్రోల్‌పై 35 పైసలు పెరిగి 19 నెలల గరిష్టాన్ని తాకింది. అలాగే డీజిల్‌పై 60 పైసలు చొప్పున పెరిగి ఆల్‌టైమ్‌ రికార్డ్‌ నమోదు చేసింది. 15రోజులుగా పెంచిన ధరలతో పెట్రోల్‌ ధర లీటరుకి రూ.7.97, డీజిల్‌కి రూ.8.88 పెరగడం గమనార్హం. దీంతో పెట్రోల్‌ ధర రూ.80కి చేరువైంది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 79.23కాగా, డీజిల్‌ ధర రూ. 78,27కి పెరిగింది. కాగా, 2018లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్‌ 4, 2018లో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 84కు చేరిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 16, 2018లో డీజిల్‌ ధర రూ.75.69కు చేరగా ప్రస్తుతం నూతన గరిష్టస్థాయిని నమోదు చేసింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి