పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంపు - Darsi Live News

పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంపు - Darsi Live News

పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంపు - Darsi Live News

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర మళ్లీ పెరిగింది. ఇంతకుముందు రోడ్‌ సెస్సు, ఎక్సైజ్‌ సుంకం పేరిట కేంద్ర ప్రభుత్వం వడ్డించగా ఇప్పుడు వ్యాట్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఈ భారం వేసింది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 0.93 పైసలు వ్యాట్‌ పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెట్రోల్‌పై 31శాతం + లీటర్‌కు రూ.2.76గా వున్న వ్యాట్‌ను ఇప్పుడు 31శాతం + లీటర్‌కు రూ.4కు, డీజిల్‌పై 22..75 శాతం + లీటర్‌కు రూ.3.07గా వున్న వ్యాట్‌ను 22..75 శాతం + లీటర్‌కు రూ.4కు పెంచారు. కరోనావల్ల ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.