భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్ - Darsi Live News

భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్ - Darsi Live News

M

ముంబయి :- భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్ ★ బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. ★ పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు భారీగా పడిపోయింది. ★ బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. ★ మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ★ పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ★ కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పడిపోయింది. దీంతో ధర రూ.52,300కు దిగొచ్చింది. ★ పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ★ ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.66 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1812 డాలర్లకు చేరింది. ★ బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ★ వెండి ధర ఔన్స్‌కు 0.83 శాతం పెరుగుదలతో 19.73 డాలర్లకు ఎగసింది. ★ దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పడిపోయింది. ★ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గింది. రూ.47,700కు క్షీణించింది. ★ అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.250 తగ్గుదలతో రూ.48,900కు దిగొచ్చింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి