భార్య తల నరికిన భర్త - Darsi Live News

భార్య తల నరికిన భర్త - Darsi Live News

గుంటూరు : గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ఎన్‌ఎస్‌పి అతిధి గహం వద్ద దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై ఓ భర్త వేటకొడవలితో దాడి చేశాడు. భార్య మెడను నరికి.. ఆపై తల, మొండెంను వేరు చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గత అర్థరాత్రి 12 గంటల సమయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భార్యను అడ్డగించిన భర్త శ్రీనివాసరావు(46) ఆమెను దారుణంగా హత్య చేశాడు. నిందితుడు ఎన్‌ఎస్‌పి కెనాల్స్‌ ఉద్యోగిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.