పనులు వాయిదా వేసుకుంటే.. ఆకాశమేమీ కిందపడదు - Darsi Live News

పనులు వాయిదా వేసుకుంటే.. ఆకాశమేమీ కిందపడదు - Darsi Live News

బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరిక బెంగళూరు : కరోనా పెరుగుతున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించింది. 33 గంటల పాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుంని, అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని బెంగళూరు మునిసిపాలిటీ తెలిపింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇంటిలోనే ఉండాలని, బయటికి రావద్దని, ఆకాశమేమీ కిందపడదని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావ్‌ ప్రజలను హెచ్చరించారు. 'శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ బెంగళూరు సిటీలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. గౌరవనీయ ప్రజలారా... దయచేసి ఇంట్లోనే ఉండండి. ఇది అందరి కోసం ప్రకటించింది. ఎవరూ మినహాయింపులు కోరవద్దు. ఒక్కరోజు పనులను వాయిదా వేసుకుంటే.. ఆకాశమేమీ కూలిపోదు. దయచేసి అందరూ స్వీయ క్రమశిక్షణ పాటించండి. ప్రభుత్వానికి సహకరించండి. హ్యాపీ సండే' అని ట్వీట్‌ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి