ప్రతీ రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు - Corona Cases - Darsi Live News

ప్రతీ రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు - Corona Cases - Darsi Live News

ప్రతీ రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు క్వారంటైన్ సెంటర్లలో వసతులు లేవు,వైద్యం సంగతి దేవుడేరుగు కనీసం సరైన భోజనం కూడా లేదంటూ కరోనా బారిన పడిన వారు గగ్గోలు పెడుతున్నారు రోడ్ల మీదే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి *ఇలాంటి సమయంలో జే ట్యాక్స్ వసూళ్ల కోసం జగన్ పరితపిస్తుండటం దారుణం* మద్యం దుకాణాలను రాత్రి 9 గంటల వరకూ తెరిచి ఉంచాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం ఇప్పటికే మద్యం దుకాణాలు జగన్ కరోనా ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయాయి మద్యం దుకాణాల దగ్గర కుమ్ములాటలు,కనీస జాగ్రత్తలు కూడా లేకుండా జరుగుతున్న అమ్మకాల వలనే రాష్ట్రంలో కేసులు వేల సంఖ్యలో వస్తున్నాయి రేట్లు పెంచి మద్యపాన నిషేధం చేస్తున్నాను అని బిల్డప్ ఇచ్చారు *ఇప్పుడు అమ్మకాల సమయం రాత్రి 9 వరకూ పెంచడం కూడా మద్యపాన నిషేధం లో భాగమేనా?* *అకౌంట్స్ కోసం మరో గంట అదనం అంటూ 9 గంటల వరకూ మద్యం దుకాణాలు తెరవటం జగన్ మార్క్ డ్రామా* *మద్యపాన నిషేధం అంటూ మహిళల్ని మోసం చేసారు.* *ఇప్పుడు అమ్మకాల సమయం పెంచి రాష్ట్రంలో ప్రజల్ని చంపేస్తారా?* *ఇక నుండి కరోనా మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలు గానే పరిగణించాలి* *తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయ్యాలి.*

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి