ప్రేమపేరుతో పాస్టర్ పాడుపని.. యువతిని గర్భవతిని చేసి.. మోజు తీరాక.. Darsi Live News

ప్రేమపేరుతో పాస్టర్ పాడుపని.. యువతిని గర్భవతిని చేసి.. మోజు తీరాక.. Darsi Live News

పాస్టర్ రాజ్ కుమార్ యువతిని ప్రేమ పేరుతో వంచించాడు. ఆరేళ్లు ఆమెతో తిరిగి గర్భవతిని చేసి చివరికి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు పాస్టర్‌ని అదుపులోకి తీసుకున్నారు. దైవసందేశం వినిపించాల్సిన పాస్టర్ యువతికి ప్రేమసందేశమిచ్చాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో హద్దులు దాటి గర్భవతిని చేశాడు. తీరా ప్రియురాలిపై మోజు తీరాక ముఖం చాటేశాడు. ఎవరికీ తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించడంతో పాస్టర్ బండారం బయటపడింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పలమనేరు మండలం నెల్లిపట్ల పంచాయతీ పరిధిలోని జంగాల అగ్రహారంలో పాస్టర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఆరేళ్లు ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని లొంగదీసుకుని కామకోరికలు తీర్చుకున్నాడు. ఆమె గర్భం దాల్చిందని తెలియడంతో వెంటనే అబార్షన్ చేయించాడు. తీరా ప్రియురాలిపై మోజు తీరాక ముఖం చాటేయడం మొదలుపెట్టాడు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి