చంద్రముఖి-2 పై లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చిన లారెన్స్‌ - Darsi Live News

చంద్రముఖి-2 పై లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చిన లారెన్స్‌ - Darsi Live News
 

రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలతో 2005లో వచ్చిన చంద్రముఖి ఘనవిజయం అందుకుంది. ముఖ్యంగా రజినీకాంత్‌, జ్యోతికల నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌ చేయాలంటూ ఎప్పటి నుండో ప్రతిపాదన ఉండగా స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతోంది. అయితే చంద్రముఖి సీక్వెల్‌లో కియారా అద్వానీ, సిమ్రాన్‌, జ్యోతిక నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే హీరో లారెన్స్‌ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై లారెన్స్‌ స్పందించారు. చంద్రముఖి-2 సీక్వెల్‌లో కియారా అద్వానీ, సిమ్రాన్‌, జ్యోతిక నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది అన్న ఆయన నటీనటుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు.