ప్రముఖ నటుడు రావి కొండలరావు కన్నుమూత - Darsi Live News

ప్రముఖ నటుడు రావి కొండలరావు కన్నుమూత - Darsi Live News

బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు కన్నుమూత ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత రావి కొండలరావు(88) కన్నుమూశారు.  బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా హుద్రోగ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.  1932, ఫిబ్రవరి 11న ఆయన సామర్లకోటలో జన్మించారు. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ ప్రస్తావనను ప్రారంభించారు. ఆయన సతీమణి రాధా కుమారి కూడా వందలాది సినిమాలలో నటించారు. ఆమె కొన్ని సంవత్సరాల కిందట తనువు చాలించారు. ఆమె మరణంతో రావి కొండలరావు మానసికంగా క్రుంగి పోయారు. ఇదే సమయంలో ఆయనకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. భైరవ ద్వీపం (1994), బృందావనం (1992) పెళ్ళి పుస్తకం (1991) చల్లని నీడ (1968) సినిమాలకు ఆయన రచయితగా పని చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మూవీస్ నిర్మించిన సినిమాలకు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపుగా 60కు పైగా కథలు అందించిన ఆయన పలు పుస్తకాలు కూడా వ్రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రావి మరణంపై సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి