కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కీలక నిర్ణయాలు - Darsi Live News

కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కీలక నిర్ణయాలు - Darsi Live News

అమరావతి : కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కీలక నిర్ణయాలు

కోవిడ్‌ నివారణా చర్యల్లో మరో కీలక అడుగు* *రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు సంఖ్య 5 నుంచి 10 కి పెంపు* *వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సేవలకు నిర్ణయం* *జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి* *ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు* *ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నివేదిక తయారీ* *5 రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు* *వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని సీఎం ఆదేశం* *కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవరిని కలవాలన్న దానిపై అవగాహనకు భారీ ప్రచారం* *కోవిడ్‌ ఎవరికైనా వస్తుంది, ఆందోళన వద్దు వైద్య సహాయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలి* *85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ నయం అవుతోంది* *జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, వయసులో పెద్ద వాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దు* *– ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌* అమరావతి: – కోవిడ్‌ నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష – డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి సహా కీలక అధికారులు హాజరు – రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ విస్తరణ, తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు – టెస్టుల సంఖ్య బాగా పెంచుతున్నామన్న అధికారులు – ప్రతి రోజూ 35 నుంచి 45వేల వరకూ పరీక్షలు చేస్తామన్న అధికారులు – టెస్టులు బాగా పెంచడంతో పాటు, ఇతర రాష్ట్రాల సరిహద్దులు పూర్తిగా తెరవడం వల్ల రాకపోకలు బాగా జరుగుతున్నందువల్ల కేసుల సంఖ్య పెరిగిందని వివరించిన అధికారులు కోవిడ్‌ నివారణా చర్యలపై సీఎం: – కోవిడ్‌ కేసుల కోసం నిర్దేశించుకున్న ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైన దృష్టి పెట్టాలి: – వైద్యుల పరంగా, వసతుల పరంగా, నాణ్యమైన సేవలపరంగా ఈ ఆస్పత్రులను బలోపేతం చేయాలని స్పష్టం చేసిన సీఎం – జిల్లాల్లో కోవిడ్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టాలన్న సీఎం – క్రిటికల్‌ కేర్‌ కోసం పెట్టుకున్న రాష్ట్రస్థాయి 5 ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యులపై పని భారం లేకుండా ప్రణాళిక తయారు చేసుకోవాలన్న సీఎం – ఈ ఐదు ఆస్పత్రుల్లో సేవల నాణ్యత ఇంకా పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై వెంటనే ఆలోచనలు చేయాలన్న సీఎం – అలాగే ప్రస్తుతం ఉన్న రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి కనీసం 10 వరకూ పెంచాలన్న సీఎం – దీని కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్న సీఎం – ఇందులో క్రిటికల్‌ కేర్‌ సౌకర్యాలు అందించాలన్న సీఎం – దీని వల్ల వైద్యులపై పని భారం తగ్గుతుందన్న సీఎం – వైద్యులపై విపరీత పని భారం పడకుండా.. వారి నుంచి నాణ్యమైన సేవలు పొందాలన్న సీఎం – త్వరగా వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆదేశం – కోవిడ్‌ కేసుల కోసం ఉద్దేశించిన 84 ఆస్పత్రులను పూర్తి నియంత్రణలోకి తీసుకోవాలి – రాష్ట్రస్థాయి కోవిడ్‌ఆస్పత్రుల మాదిరిగా ఈ ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయి సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం – ఈ ఆస్పత్రులపై రెండు, మూడు రోజుల్లో నివేదిక తయారు చేయాలన్న సీఎం – మౌలిక సదుపాయాల పరంగా, వైద్య సిబ్బంది పరంగా ఏ అవసరాలు ఉన్నాయన్న దానిపై వివరాలు నివేదికలో ఉండాలన్న సీఎం – ఇది చాలా ప్రాధాన్యత అని అధికారులను ఆదేశించిన సీఎం – కోవిడ్‌ కోసం నిర్దేశించిన ఆస్పత్రుల్లో వైద్య పరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమని సీఎం వెల్లడి – దీని వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, వైద్యులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేస్తారన్న సీఎం – టెలి మెడిసిన్‌పై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని సీఎం ఆదేశం మందులు ఇంటికి సరఫరా చేస్తున్నారా? లేదా? మరోసారి పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశం – వైద్య రంగంలో చేపట్టనున్న నాడు – నేడు కార్యక్రమాలపై ఫోకస్‌ పెంచాలన్న సీఎం – ఇవి పూరై్తతేనే కోవిడ్‌ లాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని చెప్పిన సీఎం – కోవిడ్‌పై మరింత అవగాహన కలిగించేలా ఉద్ధృతంగా ప్రచారం చేయాలని సీఎం ఆదేశం – కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఏం చేయాలి? ఎవర్ని కలవాలి? అన్నది అందరికీ తెలియాలి – ఎలాంటి భయాందోళన వద్దని ప్రజలకు చెప్పాలి – కోవిడ్‌ ఎవరికైనా రావొచ్చు, 85 శాతం మంచికి ఇళ్లలోనే ఉండి నయం అవుతున్నారు. – క్షేత్రస్థాయిలో ఈ సమాచారాన్ని తెలియజేస్తూ హోర్డింగ్స్‌ పెట్టాలని సీఎం ఆదేశం – గ్రామ సచివాలయాల్లో కూడా ఈ హోర్డింగ్స్‌ పెట్టాలని కూడా సీఎం ఆదేశం – క్వారంటైన్‌ సెంటర్ల సంఖ్య కన్నా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలన్న సీఎం – కోవిడ్‌ ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడానికి ర్యాపిడ్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చినందున ఎవరిని ఎక్కడ పెట్టాలన్న దానిపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత వారికి మంచి సేవలు అందించాలన్న సీఎం – అలాగే కాల్‌ సెంటర్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వినతుల మీద ప్రత్యేక దృష్టి వహించాలన్న సీఎం – వచ్చే మూడు, నాలుగు నెలలపాటు.. నిర్దేశించుకున్న కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం