పోలీస్‌ స్టేషన్‌లో శిరోముండనం, సిఎం సీరియస్‌ - Darsi Live News

పోలీస్‌ స్టేషన్‌లో శిరోముండనం, సిఎం సీరియస్‌ - Darsi Live News

సీతానగరం: ఓ దళిత యువకుడికి పోలీస్‌ స్టేషన్‌లో శిరోముండనం చేయడంపై సిఎం జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు. వెంటనే ఈ ఘటనకు కారణమైన ఒక ఇంఛార్జ్‌ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్‌ చేశారు. వారిపై ఎస్‌సిఎస్‌టి వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మునికూడదలి గ్రామం వద్ద ఈనెల 18వ తేదీ రాత్రి ఇసుక లారీ బైక్‌ను ఢ కొట్టడంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది. దీంతో కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అదే సమయంలో కారులో అటుగా వచ్చిన మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్‌ భర్త కవల కృష్ణమూర్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంద లారీని వదలేయండి అని చెప్పడంతో ఆ యవకులు ఆయనతో గొడవకు దిగి కారు అద్దాలను పగులకొట్టారు. అడ్డుకోబోయిన అడప పుష్కరం అనే అతడ్ని కొట్టారు. దీంతో గొడవ పడిన ఐదుగురు యువలకులపై అడప పుష్కరం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సోమవారం ఇన్‌ఛార్జ్‌ ఎస్సై ఫిరోజ్‌ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. అంతేకాక ట్రిమ్మర్‌ తో అతడి గడ్డం, మీసాలు, తల వెంట్రుకులను తొలగించి విడిచిపెట్టారు. ఈ విషయం వాట్సాప్‌లో హల్‌చల్‌ చేయడంతో మంగళవారం దళిత సంఘాలు రాజమహేంద్రవరం ఆర్బన్‌ ఎస్పీ బాజ్‌పారు దృష్టికి తీసుకెళ్లాయి. ఘటనను మంత్రులు సచరిత, ఆదిమూలపు సురేష్‌ ఖండించారు. మంత్రి విశ్వరూప్‌ రాజమండ్రి ఆసుపత్రిలో బాధితుడు ప్రసాద్‌ని పరామర్శించారు.