ఏపీకి వచ్చేవారికి డీజీపీ అభ్యర్థన - Amaravathi - Darsi Live News

ఏపీకి వచ్చేవారికి డీజీపీ అభ్యర్థన  - Amaravathi - Darsi Live News

పరిస్థితి అర్థం చేసుకోండి... ఏపీకి వచ్చేవారికి డీజీపీ అభ్యర్థన సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి* *పగటి పూట మాత్రమే రాష్ట్రంలోనికి అనుమతి* *స్పందన పోర్టల్ ద్వారా పాస్ ఉండాల్సిందేనని వెల్లడి* ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. ఏపీకి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతాయని, సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి వచ్చే వారు స్పందన పోర్టల్ ద్వారా అనుమతి తీసుకుని పాస్ పొందిన తరువాతనే రావాలని సూచించారు. పాస్ లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ అనుమతించబోమని స్పష్టం చేసిన ఆయన, రాత్రి పూట అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని అన్నారు.