4.2 శాతానికి పడిపోయిన జిడిపి...Darsi Live News

4.2 శాతానికి పడిపోయిన జిడిపి...Darsi Live News

2009 తర్వాత ఇదే అత్యల్పం పడిపోయిన ఎగుమతులు, దిగుమతులు 55.5 శాతం మేర క్షీణించిన పరిశ్రమ ఉత్పాదకత

 

న్యూఢిల్లీ : భారత్‌ను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు పెట్టిస్తామన్న కేంద్రం ప్రగల్భాలకే పరిమితమౌతోంది. కేంద్ర గణాంకాలు, ప్రోగామ్‌ అమలు మంత్రిత్వ శాఖ (ఎంఒఎస్‌పిఐ) గత మే 29న తాత్కాలిక అంచనాల నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దేశ జిడిపి 4.2 శాతానికి పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోవడంతో ఉత్పత్తులకు దేశీయంగా డిమాండ్‌ అమాంతం పడిపోయింది. 2008ా09 తర్వాత ఇంత స్థాయిలో జిడిపి పడిపోవడం ఇదే తొలిసారి. పరిశ్రమల్లో ఉత్పాదకత పడిపోయింది. తయారీ, విద్యుత్‌, మైనింగ్‌ వంటి అనుబంధ రంగాల్లో క్షీణత మైనస్‌లకు చేరింది. ఈ నివేదికను కూలంకశంగా పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. డిమాండ్‌ ఎండమావి 2019ా20 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు 4.2 శాతానికి పడిపోయింది. 2008ా09 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యల్పం. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగానూ, ఎగుమతుల పరంగానూ డిమాండ్‌ పడిపోవడం దీనికి ప్రధానకారణం. త్రైమాసిక ప్రాతిపదికన ప్రకారం చూస్తే.. 2017ా18 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి 8.2 శాతానికి చేరుకున్న జిడిపి, 2019ా20 నాల్గవ ఆర్థిక సంవత్సరానికి 3.1 శాతానికి పడిపోయింది. 2011-12 వరుస ఏడాదుల తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఎగుమతులు, దిగుమతలు మైనస్‌ 3.6 శాతం, మైనస్‌ 6.8 శాతానికి పడిపోయాయి. 2015ా16 ఆర్థిక సంవత్సరం తర్వాత 2019ా20 ఆర్థిక సంవత్సరంలో అవి క్షీణించడం తొలిసారి. 2015ా16 ఆర్థిక సంవత్సరం తర్వాత 2019ా20 ఆర్థిక సంవత్సరంలో మొదటి సారి..ఎగుమతుల కంటే దిగుమతుల తగ్గడంతో జిడిపి వృద్ధికి నికర ఎగుమతుల సహకారం 0.9 పాయింట్ల వద్ద సానుకూలంగా ఉంది. ప్రభుత్వ పన్ను ఆదాయాలు, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావంతో 2019ా20 ఆర్థిక సంవత్సరంలో నామ మాత్రపు జిడిపి వృద్ధి 48 సంవత్సరాల కనిష్టానికి 7.2 శాతానికి పడిపోయింది. వృద్ధే నోచుకోని తయారీ రంగం అదనపు విలువా..అదే గతి ! ఉత్పాదక వైపు చూస్తే, 2019ా20 ఆర్థిక సంవత్సరంలో స్థూల అదనపు విలువ రంగం కూడా బాగా క్షీణించింది. ఈ కాలంలో గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జివిఎ) 3.9 శాతం మేర క్షీణించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా తయారీ రంగంలో జివిఎ ఆర్థిక వృద్ధికి నోచుకోలేదు. మొత్తం నామామాత్రపు జివిఎలో దాని వాటా కూడా 2018ా19 ఆర్థిక సంవత్సరం 16.1 శాతం నుండి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 15.1 శాతానికి పడిపోయింది. నిర్మాణ రంగంలో జివిఎ ఎనిమిదేళ్ల కనిష్టానికి పతనమై 1. 3 శాతానికి పడిపోయింది. ఇక సేవల రంగాల్లో , ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, ప్రొఫెషనల్‌ సర్వీసుల్లో జివిఎ వృద్ధి ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరువైంది. వాణిజ్య, రవాణా, కమ్యూనికేషన్‌, ప్రసారానికి సంబంధించిన రంగాల్లో 11 ఏళ్ల కనిష్టానికి చేరువై 3.6 శాతాన్ని నమోదు చేసింది. అయితే జివిఎ వృద్ధి సాధించిన రంగాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పరిపాలన, రక్షణ సేవలు(10.0 శాతం) వ్యవసాయం, అనుబంధ కార్యాకలాపాలు 4.1 శాతం, మైనింగ్‌ 3.1 శాతం వృద్ధిని సాధించాయి. పడిపోయిన పరిశ్రమ ఉత్పాదక రేటు పారిశ్రామిక ఉత్పాధక వృద్ధి ఢమాల్‌ పరిశ్రమ ఉత్పాదక(ఐఐపి) వృద్ధి రేటు 2019-20 ఏప్రిల్‌లో మైనస్‌ 55. 5 శాతం క్షీణించిందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా, ప్రధాన పరిశ్రమలన్నీ గత ఏప్రిల్‌ నుంచి కార్యకలాపాలు చేపట్టకపోవడమే అందుకు కారణం. మార్చిలో మైనస్‌ 18.3 శాతం (సవరించిన) క్షీణతతో పోలీస్తే..ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ ఏడాది ఏప్రిల్‌లో మూడు అనుబంధ రంగాల్లో ఉత్పాదకత తగ్గింది. తయారీ, విద్యుత్‌ రంగాల్లో ఉత్పాదకత మైనస్‌ 64.3 శాతం, మైనస్‌22.6 శాతం తగ్గుదల నమోదు చేసింది. అదే మార్చిలో మైనస్‌ 22.2 శాతం (సవరించిన), మైనస్‌ 8.2 శాతం క్షీణత నమోదైంది. మైనింగ్‌ రంగ ఉత్పత్తుల్లో మార్చిలో మైనస్‌ 1.4 శాతం క్షీణత నమోదు కాగా, ఏప్రిల్‌లో మైనస్‌ 27.4 శాతం నమోదైంది. ఎనిమిది కోర్‌ మౌలిక సదుపాయాల పరిశ్రమల్లో (కోర్‌ ఐఐపి) ఉత్పాదకత మార్చిలో మైనస్‌ 9 శాతం క్షీణత నమోదు చేయగా, ఏప్రిల్‌లో మైనస్‌ 38.1 శాతం నమోదైంది. మొత్తం అనుబంధ పరిశ్రమల ఉత్పత్తి ఈ ఏప్రిల్‌లో కుదించగా, సిమెంట్‌(మైనస్‌ 86.6 శాతం) పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు (మైనస్‌ 24.2శాతం) విద్యుత్‌ మైనస్‌ 22.8 శాతం తగ్గింది. పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పిఎంఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో ఊహించని స్థాయి 27.4 శాతానికి పడిపోయిన తర్వాత, తయారీ రంగంలో పిఎంఐ క్షీణత మే 2020లో 30.8కి దిగజారింది. 2005లో పిఎంఐ సర్వే చేపట్టిన నాటి నుండి ఇది రెండవ అత్యధిక క్షీణత రేటు. తగ్గిన డిమాండ్‌ను సూచిస్తూ కొత్త ఆర్డర్లు, ఉత్పాదకత ఘోరంగా పడిపోయింది.