నిరసనలు.... నేలిపివేత

దక్షిణాది పొగాకు మార్కెట్లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే ధరలు దారుణమంటూ రైతులు ఆందోళన చెందుతుండగా కరోనా సాకుతో కొన్ని కంపెనీలు కొనుగోళ్లు తగ్గించాయి. వ్యాపారుల వైఖరితో విసుగుచెందిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. వారంరోజులుగా పలుచోట్ల వేలాన్ని నిలిపివేస్తున్నారు. ఈ సీజన్‌ మేలురకం గ్రేడ్‌ అధికంగా పండిన నేపథ్యంలో తొలుత హాట్‌హాట్‌గా కొనుగోలు చేసిన వ్యాపారులు దాదాపు నెలరోజులుగా క్రమంగా తగ్గించారు. పలు ఎక్స్‌పోర్టు కంపెనీలు తమకు విదేశీ ఆర్డర్లు రాలేదన్న సాకుతో కొనుగోళ్లు తగ్గించగా ప్రధానమైన ఐటీసీ లెక్కకు అధికశాతం కొనుగోలు చేస్తున్నా మార్కెట్లో పోటీ లేక ధరలు తగ్గించివేసింది

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి