కాకినాడ-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం: ఔరంగాబాద్ వద్ద..!

అమరావతి: కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌‌కు ప్రమాదం తృటిలో తప్పింది. రైలు కదులుతున్న సమయంలోనే ఇంజిన్ నుంచి బోగీలన్ని విడిపోయాయి. బోగీలు లేకుండానే ఇంజిన్ కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలు విడిపోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. స్టేషన్ అధికారులకు సమాచారం