సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు అరుంధతి నక్షత్ర దర్శనం

రత్నగిరివాసుడైన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం నవ దంపతులైన స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ రీతిలో అరుంధతి నక్షత్ర దర్శనం కల్పించారు. రాత్రి ఏడు గంటలకు ప్రధానాలయం నుంచి నవ దంపతులను బాజాభజంత్రీల నడుమ తూర్పు రాజగోపురం వద్దకు తోడ్కొనివచ్చారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి