మొరాయిస్తున్న సర్వర్‌ !

పదో తరగతి విద్యార్థుల మార్కుల నమోదు ప్రక్రియలో అడుగు ముం ుకుపడటం లేదు. సీసీఈ మార్కుల నమోదుకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. అయితే ముందు గా 10వ తరగతి విద్యార్థుల మార్కులను కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీఎ్‌సఈ) పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి నమోదు చేయాల్సి ఉంటుంది. 22వ తేదీ రాత్రి నుంచి సర్వర్‌ మొరాయించడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.