ఫెన్సింగ్‌ రాళ్లకు కేరాఫ్‌ బల్లికురవ

ఫెన్సింగ్‌ రాళ్లకు బల్లికురవ కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. వీటి వలన వందల మంది కూలీలకు ఉపాధి దొరుకుతోంది. రాష్ట్రంలో పలు జిల్లా లతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ రాళ్లు ఎగు మతి అవుతున్నాయి. బల్లికురవ, మార్టూరు, సంతమా గులూరు మండలాల పరిధిలో సుమారు 500కుపైగా గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి నుంచి ప్రతి రోజూ పనికిరాని రాయి వస్తుంది. వీటిని పొలాలకు రక్షణ కో సం ఏర్పాటు చేసే ఫెన్సింగ్‌ రాళ్లగా కూలీలు తయా రు చేస్తున్నారు.